Skip to main content

Rupee-Rial Mechanism: భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన దేశం?

India-Iran Flag

భారత్‌కు చమురు, గ్యాస్‌ సరఫరా చేసేందుకు ఇరాన్‌ ముందుకు వచ్చింది. దేశీయ ఇంధన అవసరాలను తీరుస్తామని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి అలీ చెగెని మార్చి 19న వెల్లడించారు. రూపాయి–రియాల్‌ వాణిజ్య వ్యవస్థను తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ విధానం కార్యరూపంలోకి వస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.2,28,000 కోట్లను తాకుతుందని అన్నారు. సహజ వాయువును రవాణా చేయడం కోసం ఇరాన్‌–పాకిస్తాన్‌–ఇండియా పైప్‌లైన్‌ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి, ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడానికి భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

CEPA: భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న దేశం?

రూపాయి–రియాల్‌ విధానం కింద..
భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా గతంలో ఇరాన్‌ ఉండేది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైదొలిగి చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో.. ఇరాన్‌ నుంచి దిగుమతులను భారత్‌ నిలిపివేయాల్సి వచ్చింది. 2018–19లో భారత్‌–ఇరాన్‌ మధ్య వాణిజ్యం రూ.1,29,200 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జనవరి మధ్య ఇది రూ.15,200 కోట్లకు పరిమితమైంది. రూపాయి–రియాల్‌ విధానం కింద భారత చమురు శుద్ధి కంపెనీలు స్థానిక ఇరానియన్‌ బ్యాంకుకు రూపాయల్లో చెల్లిస్తాయి. భారత్‌ నుండి తనకు అవసరమైన వస్తువుల దిగుమతుల కోసం చెల్లించడానికి ఇరాన్‌ ఈ నిధులను ఉపయోగిస్తుంది.

Unified Payments Interface: భారత వెలుపల యూపీఐని అమలు చేయనున్న తొలి దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Mar 2022 05:13PM

Photo Stories