Skip to main content

AU MOU With UK University: ఏయూతో యూకే యూనివర్సిటీ ఎంవోయూ

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హైలాండ్స్‌ అండ్‌ ఐస్‌లాండ్స్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది.
AU MOU With UK University
AU MOU With UK University

ఏయూలో  జరిగిన  కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, సౌత్‌ ఇండియా బ్రిటిష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌ సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్, యూకే ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సనమ్‌ అరోరా ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు.

Foundation stone for Central Tribal University in AP: ఏపీలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాల‌యానికి శంకుస్థాపన

ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా ఎంబీఏ, ఎమ్మెస్సీ అప్లయిడ్‌ డేటా ప్రాసెస్‌ కోర్సుల్లో రెండు యూనివర్సిటీలు సంయుక్త సహకారంతో ముందుకెళ్తాయని చెప్పారు. ఏయూ ద్వారా రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. యూకే ఇండియా ఎడ్యుకేషన్‌ పాలసీ ద్వారా ఈ కోర్సులు చేసే విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీతో పాటు స్కాలర్‌షిప్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు.

AP Govt MoU with edX: ఎడెక్స్‌తో ఏపీ సర్కార్‌ ఒప్పందం

Published date : 26 Aug 2023 05:36PM

Photo Stories