AP Govt MoU with edX: ఎడెక్స్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం
ఆగస్టు 17న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. ఈ ఒప్పందం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది.
Fishing Harbour in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్
శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు… ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
AP Maritime Board: పర్యాటక ప్రదేశాలుగా ఏపీ ఫిషింగ్ హార్బర్లు