National Awards: ఏపీ విద్యుత్ సంస్థలకు జాతీయ అవార్డులు
రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్‌మెంట్ (ఐఎస్‌ఓఏ) అప్లికేషన్‌కుగానూ స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో) దక్కించుకుంది.
ఈ అప్లికేషన్‌ను ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) అభివృద్ధి చేసింది. అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ (పీఎస్‌పీ) ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించినందుకుగానూ ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) కైవసం చేసుకుంది.
అవార్డులు వచ్చాయి ఇలా..
డిస్కంలు ఓపెన్ యాక్సెస్ (ఓఏ) వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రంలో వివిధ పవర్ డెవలపర్లు అనేక పవర్ ప్లాంట్‌లను స్థాపించారు. ఓఏ వినియోగదారులలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, నోడల్ ఏజెన్సీ అయిన ఏపీఎస్‌ఎల్‌డీసీ, ఎనర్జీ బిల్లింగ్ సెంటర్ (ఈబీసీ) సకాలంలో నెలవారీ విద్యుత్, డిమాండ్ సెటిల్‌మెంట్లు చేయటం కష్టంగా మారింది. దీంతో బహుళ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు వివిధ ఓపెన్ యాక్సెస్ జనరేటర్ల నుంచి విద్యుత్ సరఫరాను పొందడంలో జాప్యం జరిగేది.
Bharata Ratna: 'భారతరత్న'కు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'.. వారికి ఉండే సౌకర్యాలు ఇవే..
దీంతో ఏపీఎస్‌ఎల్‌డీసీ అంతర్గత ఐటీ బృందం ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్‌ల ఆలస్యాన్ని తగ్గించేందుకు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్‌మెంట్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఈ ప్రక్రియ సులభం అయ్యింది. ఇక పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్‌ను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. 44.79 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం ఉన్న 39 అనువైన ప్రదేశాల్లో టెక్నో–కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ (టీసీఎఫ్‌ఆర్)ను నెడ్‌కాప్ తయారు చేసింది.
అలాగే 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాలతో కూడిన 4,280 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (ఐఆర్‌ఈపీఎస్) పాణ్యం మండలం పిన్నాపురం వద్ద నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఈ చర్యలు జాతీయ స్థాయిలో అవార్డులు రావడానికి కారణమయ్యాయి.