ISTE Awards : ఐఎస్‌టీఈ అందించే అవార్డులకు ఎంపికైన జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు వీరే..
అనంతపురం: ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్‌టీఈ) అందించే అవార్డులకు జేఎన్‌టీయూ (ఏ)కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వరరెడ్డి (అన్నా యూనివర్సిటీ నేషనల్ అవార్డు ఫర్ ది అవుట్ స్టాండింగ్ అకాడమీ టీచర్ కేటగిరీ) తో పాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్ వీబీ చిత్ర అవార్డులకు ఎంపికైనట్లు వెల్లడించారు.
Government Employees: ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి
ఈనెల 22న ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఐఎస్‌టీఈ యాన్యువల్ నేషనల్ ఫ్యాకల్టీ కన్వెన్షన్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకుంటారని తెలిపారు. జాతీయ పురస్కారాలకు ఎంపికైన ప్రొఫెసర్లను వీసీ శ్రీనివాసరావుతో పాటు రెక్టార్ ప్రొఫెసర్ ఎం. విజయ్‌కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శశిధర్ అభినందించారు.
NEET UG Scam 2024 : రేపు భారీ ఎత్తున స్టూడెంట్ మార్చ్.. ఎందుకంటే..?