Nobel Prize 2023 in Economic Sciences: యు.ఎస్ లేబర్ ఎకనామిస్ట్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్
Sakshi Education
ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
2023 సంవత్సరానికిగాను ఆర్థిక శాస్త్రంలో యు.ఎస్ లేబర్ ఎకనామిస్ట్ క్లాడియా గోల్డిన్ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. లేబర్ మార్కెట్‌లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని ప్రకటించింది.
- ఆర్థిక శాస్త్రంలో ఇప్పటి వరకు 55 సార్లు నోబెల్‌ను ప్రకటించారు.
- ఇప్పటి వరకు ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు మహిళలకు ఈ బహుమతి లభించింది.
Published date : 10 Oct 2023 10:02AM