Nobel Peace Prize 2023: నర్గిస్‌కు నోబెల్ శాంతి పురస్కారం
Sakshi Education
2023గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.
2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గిస్ మొహమ్మదిని వరించింది.
Nobel Prize 2023 in Literature: సాహిత్యంలో జాన్ ఫోసెకు నోబెల్
మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. ఇరాన్ మహిళల కోసం నర్గిస్ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. నర్గిస్ మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు.
Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్
- 1901 నుంచి ఇప్పటి వరకు 104 సార్లు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు.
- ఇప్పటివరకు 19 మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
- అవార్డు ప్రకటించన సమయంలో 5గురు శాంతి బహుమతి గ్రహీతలు జైల్లో ఉన్నారు.
Nobel Prize in Chemisty 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీతలు వీరే...
Published date : 07 Oct 2023 09:36AM