Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. వారెవరంటే..
జాన్ జోసెఫ్ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
కాగా.. గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతి వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117 సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు.
Nobel Prize 2024: మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనిపెట్టిన శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు.. ఏమిటీ మైక్రో ఆర్‌ఎన్‌ఏ?
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్‌ఫ్రెడ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీ విజేతలకు బహుమతులు అందజేస్తారు. అవార్డు గ్రహీతలు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుకుంటారు.
Tags
- Nobel Prize
- John Hopfield
- Geoffrey Hinton
- Nobel Prize in Physics
- Nobel Prize in physics winners
- Artificial Neural Networks
- Nobel Prize 2024
- Nobel prize 2024 winners
- Nobel Prize in chemistry
- Nobel Peace Prize
- Sakshi Education Updates
- Physics
- JohnJosephHopfield
- GeoffreyHinton
- MachineLearning
- ArtificialNeuralNetworks
- Royal Swedish Academy
- NeuralNetworks
- PhysicsInnovation
- current affairs about awards
- currentaffairs about people