Skip to main content

Nobel Peace Prize: జపాన్‌ సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం

2024 సంవత్సరానికి జపాన్‌ సంస్థ నిహాన్ హిడాంకియోకు నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు.
Nihon Hidankyo receives the Nobel Peace Prize 2024 for nuclear disarmament efforts  Nobel Peace Prize 2024 Goes To Japanese Organisation Nihon Hidankyo

ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఈ మేరకు స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
 
కాగా హిరోషిమా, నాగ‌సాకిపై జ‌రిగిన అణుబాంబు దాడిలో దెబ్బ‌తిన్న బాధితుల కోసం నిహ‌న్ హిడంక్యో సంస్థ ప‌నిచేస్తుంది. నిహ‌న్ హిడంక్యోకు హిబకుషా అనే మ‌రో పేరు ఉంది. అణు ర‌హిత ప్ర‌పంచం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ సంస్థ సేవలు అందిస్తోంది. న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను మ‌ళ్లీ వాడ‌రాదని ఆ సంస్థ ప్ర‌త్య‌క్ష బాధితుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది.

ఇప్పటి వరకు మొత్తం 111 మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ సంవ‌త్స‌రం బహుమతికి 286 నామినేషన్లను పరిశీలించిన కమిటీ నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేసింది.

Nobel Prize In Literature: దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్.. ఆమె రాసిన పుస్తకాలు ఇవే..

Published date : 11 Oct 2024 04:42PM

Photo Stories