Skip to main content

Nobel Prize In Literature: దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్

దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్‌ పురస్కారం దక్కింది.
South Korean Author Han Kang wins Nobel Prize In Literature  Han Kang receiving Nobel Prize in Literature 2024

మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్‌ కమిటి అక్టోబ‌ర్ 10వ తేదీ నోబెల్‌ పురష్కారాన్ని ప్రకటించింది. 

హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. హాన్‌ కాంగ్‌ 1993లో మున్హాక్-గ్వా-సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’ పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. దీని ద్వారా కవయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఆమె నవలా రచయిత్రిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

హాన్‌ కాంగ్‌ ఈ అవార్డు గెల్చుకున్న తొలి ఆసియన్ మహిళగా, రెండో దక్షిణకొరియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ దాయీ జంగ్కు 2000 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. ద.కొరియా సంస్కృతి క్రమంగా అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్న తరుణంలో ఆమెకు ఈ అవార్డ్ ఆమె రచనలు గతంలోనూ అంతర్జాతీయ అవార్డులు హాన్కాంగ్కు 2016లో 'ది వెజిటేరియన్' రచనకుగాను అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లభించింది. 

Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

మాంసాహారం మానేసి శాకాహారిగా మారుదామని ఒక మహిళ తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా జీవితంలో ఆమెకు ఎదురైన అనుభవాల సమాహారంగా ఈ పుస్తకాన్ని రాశారు. 2018లో ఈమె రాసిన హ్యూమన్ యాక్ట్స్ పుస్తకం సైతం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తుది జాబితాకు ఎంపికైంది. 1998లో ఆమె రాసిన తొలి నవల బ్లాక్లోర్ మార్కెట్లోకి వచ్చింది. ది వెజిటేరియన్, గ్రీక్ లెసన్స్, హ్యూమన్ యాక్ట్స్, ది వైట్ బుక్ వంటి రచనలు ఇంగ్లిష్లోకి అనువాదమయ్యాయి. హ్యూమన్ యాక్ట్స్ రచన 1980లో హాన్ సొంత నగరం గ్వాంగ్జులో ప్రజాస్వామ్య ఉద్యమ కారుల హత్యోదంతం ఘటనలను కళ్లకు కడుతుంది. 

ఈమెది రచనా వారసత్వం..
ఈమె రచనా నైపుణ్యం వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి. ఈమె తండ్రి హాన్ స్యూంగ్ వాన్ ఆధునిక కొరియా రచ రచనాయితల్లో లబ్దప్రతిష్ఠుడిగా పేరొందారు. ఈమె గ్వాంగ్జు సిటీలో జన్మించినా కొన్నాళ్లకే కుటుంబం సియోల్ సిటీ దగ్గర్లోని సుయురి ప్రాంతానికి తరలిపోయింది. హాన్ అక్కడి యోన్సీ విశ్వవిద్యాలయంలో పుస్తకాలు తిరగేసి కొరియా సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. 

హాన్ సోదరుడు డాంగ్ రిమ్ కూడా రచయితే, హాన్ రాసిన వ్యాస సంపుటాలు సహా 18 పుస్తకాలను ఇప్పటి దాకా ఇంగ్లిష్ లోకి అనువదించారు. వీటిల్లో 'ది వెజిటేరియన్' పుస్తకం విశేష ఆదరణ పొందింది. సాహిత్య నోబెల్ను ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా రచయితలకు కట్టబెడుతున్నారన్న విమర్శల నడుమ ద.కొరియా నుంచి హాన్కాంగ్ ఈ ఆవార్డ్ను గెల్చుకోవడం గమనార్హం.

Nobel Prize 2024: ఫిజిక్స్‌లో జాన్‌ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు నోబెల్ పురస్కారం

Published date : 11 Oct 2024 02:59PM

Photo Stories