Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు
మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్ర వేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంప ర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాపు రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు.
జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు
"అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే" అని నోబెల్ కమిటీ కొనియాడింది.
అమెరికాలోని సియాటెల్లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసా జాన్ జంపర్ లండన్లోని గూగుల్ సంస్థకు చెడీప్మండ్ విభాగంలో పనిచేస్తున్నారు. 2003లో ఒక కొత్త ప్రోటీన్లను డిజైన్చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొ కటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో విని యోగిస్తున్నారు.
Nobel Prize 2024: ఫిజిక్స్‌లో జాన్ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు నోబెల్ పురస్కారం
నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్
డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణా లను ముందే అంచనావేయొచ్చు.