Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్
![Nobel laureate delivering a speech during the award ceremony., Nobel Prize in Physics 2023,Royal Swedish Academy of Sciences announcing the Physics Nobel Prize.](/sites/default/files/images/2023/10/09/nobel-prize-physics-1696852992.jpeg)
2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌ను నోబెల్‌కు ఎంపికచేసింది.
Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్, వెయిస్‌మన్‌కు నోబెల్
ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటోసెకెండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకుగాను వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.
Norman Borlaug Award: స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ అవార్డు
వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్‌లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. ప్రైజ్ మనీని ముగ్గురి శాస్త్రవేత్తలకు సమానంగా పంపిణీ చేయనున్నారు.