Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్, వెయిస్‌మన్‌కు నోబెల్
Sakshi Education
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం -2023 వరించింది.
న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం లభించింది.
Nobel Prize Money: నోబెల్ పురస్కారం నగదు భారీగా పెంపు
హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని తేలింది. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో రెండు mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది.
MS Swaminathan Award: పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు
Published date : 03 Oct 2023 08:14AM