Norman Borlaug Award: స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ అవార్డు
ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది.
AP State Co-operative Bank: ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌కు అవార్డుల పంట
ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్‌సీ చదివారు.
Shantiswaroop Bhatnagar Award: డాక్టర్ సుబ్బారెడ్డికి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు