Shantiswaroop Bhatnagar Award: డాక్టర్ సుబ్బారెడ్డికి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు
సీడీఎఫ్‌డీ లోని లాబొరేటరీ ఆఫ్ సెల్ డెత్ అండ్ సెల్ సర్వైవల్ అధిపతిగా వ్యవహరిస్తున్న సుబ్బారెడ్డి కణ జీవశాస్త్రవేత్త. శరీర క్రియలకు అత్యంత కీలకమైన ప్రొటీన్ల మధ్య సమాచార వినిమయంపై పరిశోధిస్తున్నామని, సాధారణస్థితిలో..లేదా వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్య లు వచ్చినప్పుడు ఈ సమాచార మార్పిడిలో ఏదైనా తేడాలు ఉన్నాయా? అన్నది కూడా తమ అధ్యయనంలో భాగమని సుబ్బారెడ్డి తెలిపారు. కణాల లోపల కూడా ప్రొటీన్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామయని అన్నారు.
Kaloji Narayana Rao Award 2023: జయరాజ్‌కు కాళోజీ నారాయణ రావు అవార్డు 2023
కేన్సర్ కణాలపై ఎక్కువగా దృష్టి పెట్టామని, ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో కేన్సర్‌కు మరింత సమర్థచికిత్స అందించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. డాక్టర్ ఎం.సుబ్బారెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గతంలోనూ కేన్సర్ కణితులను అణచివేసే ఓ జన్యువును నియంత్రించే ప్రొటీన్ ను గుర్తించడంలో విజయం సాధించారు.
MS Swaminathan Award: పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు