Skip to main content

Kaloji Narayana Rao Award 2023: జయరాజ్‌కు కాళోజీ నారాయణ రావు అవార్డు 2023

పద్మ విభూషణ్ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే "కాళోజీ నారాయణ రావు అవార్డు" 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు శ్రీ జయరాజ్ కు దక్కింది.
Kaloji Narayana Rao Award 2023 winner Jayaraj, Eminent Artist Sri Jayaraj
Kaloji Narayana Rao Award 2023 winner Jayaraj

సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా  అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కవి శ్రీ జయరాజ్ ను ఎంపిక చేశారు.
ఈ నెల 9వ తేదీన శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి శ్రీ జయరాజ్ కు 'కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా ₹1,01,116 నగదు రివార్డును, జ్జాపికను అందించి దుశ్శాలువాతో సత్కరించనున్నారు.

Ts Government Announces dasarathi Award: నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారం

Published date : 08 Sep 2023 11:22AM

Photo Stories