Skip to main content

Ts Government Announces dasarathi Award: నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారం

కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా ‘దాశరథి కృష్ణమాచార్య’ పురస్కారం అందజేస్తోంది.
nateswara sharma
nateswara sharma

ఈ ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య’ పురస్కారాన్ని 2023 సంవత్సరానికి గాను  కామారెడ్డికి చెందిన ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావధాని అయాచితం నటేశ్వరశర్మకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.  ఈ నెల 22న రవీంద్రభారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కారంతో పాటు రూ.1,01,116 నగదు, శాలువా, జ్ఞాపికను పురస్కార గ్రహీతకు అందజేస్తారు. పురస్కారం ప్రకటించిన సందర్భంగా నటేశ్వరశర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

☛☛ International prize in statistics: తెలుగోడికి స్టాటిస్టిక్స్‌ నోబెల్‌ అవార్డు

Published date : 20 Jul 2023 03:58PM

Photo Stories