Skip to main content

International prize in statistics: తెలుగోడికి స్టాటిస్టిక్స్‌ నోబెల్‌ అవార్డు

ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు (102)కు స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది.
CR Rao
CR Rao

గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ అవార్డుగా భావించే ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు సీఆర్‌ రావును వరించింది. . 

☛☛ Henley Passport Index 2023: పాస్‌పోర్టు ర్యాంకింగ్‌లో భారత్‌ స్ధానం ఎంతంటే ?

సీఆర్‌ రావు నేప‌ధ్యం:

సీఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 
కలకత్తా మ్యాథమెటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి ఈ అవార్డును అంద‌జేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెస‌ర్ బ్రాడ్లీ ఎఫ్రాన్‌, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెస‌ర్ Emerita Nan Laird ల‌కు అంద‌జేశారు. 
2023కి సీఆర్ రావుకు అవార్డు అంద‌నుంది. భారత స్టాటిస్టిక్స్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్‌ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

☛☛​​​​​​​ World Shooting C’ships 2023: ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు షూటర్ల జోరు

 

Published date : 20 Jul 2023 02:56PM

Photo Stories