World Shooting C’ships 2023: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు షూటర్ల జోరు
ధనుశ్ శ్రీకాంత్, అభినవ్, పార్థ్ బృందం మొత్తం 1886.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో గౌతమి భానోత్, సోనమ్ మస్కర్, స్వాతి చౌధరీలతో కూడిన భారత జట్టు 1886.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది.
☛☛ Satwik smashes Guinness world record: ‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్...
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయవాడకు చెందిన ఉమామహేశ్ 229 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు.
జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్ రైజా ధిల్లాన్ రజత పతకం సాధించింది.
☛☛ Asian Athletics Championships 2023: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు