Satwik smashes Guinness world record: ‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్...
బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్‌తో సాత్విక్ రికార్డు సృష్టించాడు.జపాన్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ తమ ఫ్యాక్టరీలో ఇటీవల నిర్వహించిన టెస్టులో సాత్విక్ రాకెట్ వేగంతో స్మాష్ కొట్టాడు. సాత్విక్ స్మాష్‌కు షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
ఫార్ములావన్ సర్క్యూట్‌లో రయ్ రయ్‌మని రాకెట్ వేగంతో దూసుకెళ్లే కారు వేగం (గంటకు 372.6 కి.మీ.) కంటే కూడా సాత్విక్ స్మాష్ వేగమే ఎక్కువ! దీంతో మలేసియన్ షట్లర్ తన్ బూన్ హియాంగ్ (2013లో) గంటకు 493 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు.తద్వారా ‘ఫాస్టెస్ట్ స్మాష్’ రికార్డును సాత్విక్ సాయిరాజ్ తన పేరిట గిన్నిస్ బుక్‌లో లిఖించుకున్నాడు. మహిళల విభాగంలో మలేసియా షట్లర్ తన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డు కూడా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది.
☛☛ Asian Athletics Championships 2023: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు