Indian Chess: భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
టాప్ 10లో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్‌లు స్థానం సంపాదించడం ఇదే మొదటిసారి.
ఈ అద్భుత ఘనత సాధించిన వారు వీరే..
అర్జున్ ఎరిగైసి: నాలుగో స్థానం
డి.గుకేశ్: ఏడవ స్థానం
ఆర్.ప్రజ్ఞానంద: ఎనిమిదో స్థానం
ఈ ఘనతతో పాటు, భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచారు.
ఈ భారతీయ ఆటగాళ్ల విజయం ఇదే..
అరవింద్ చితంబరం: 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకుని 44వ స్థానం నుంచి 29వ స్థానానికి దూసుకెళ్లారు.
జులై నెల పురుషుల టాప్ 100 జాబితాలో: 10 మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి.గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) చోటు సంపాదించారు.
T20 World Cup: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ!!
మహిళా ర్యాంకింగ్స్‌లో..
ద్రోణవల్లి హారిక: రెండో స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది.
దివ్య దేశ్‌ముఖ్: ఇటీవల జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ యువ ఆటగాడు నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుంచి 20వ స్థానానికి ఎగబాకింది.