Skip to main content

Gas Cylinders: గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు క్యూఆర్ కోడ్

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్లకు క్యూఆర్ కోడ్‌లు అమలు చేయడానికి ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ వెల్లడించారు.
Minister Piyush Goyal said LPG cylinders will soon come with QR codes

ఈ చర్య వంటగ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించడానికి, సిలిండర్‌ల ట్రాకింగ్‌కు, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్‌)లో చేర్చామని, త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

మరోవైపు, నివాసాలకు 30-50 మీటర్లలోపు పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఈ చర్యకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) రూపొందించాలని ఆయన తెలిపారు.

LPG Gas Cylinder Price Cut: గ్యాస్‌ సిలిండర్ ధర తగ్గింపు.. ఎంతంటే..

పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) ఈ భద్రతా చర్యలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పనిచేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్‌ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను అమలు చేస్తుంది. 

పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్‌ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్‌ఎంఈలకు 50 శాతం రాయితీ ఇవ్వబడుతుంది.

Published date : 05 Jul 2024 03:23PM

Photo Stories