National Education Day : 2008 నవంబర్ 11న తొలి జాతీయ విద్యా దినోత్సవం..కారణం!
ప్రతి ఏటా నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యా మంత్రిగా పని చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు.
భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగానూ ఆజాద్ గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణిస్తుంటారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
దేశ స్వాతంత్య్ర సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పరిష్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1934లో యూనివర్సిటీ క్యాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
మొదటి విద్యా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం దేశంలోని గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై ఆయన దృష్టి సారించారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన విద్యారంగంలో పలు మార్పులు చేశారు.
Aligarh Muslim Unversity: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశాభివృద్ధిలో ఆజాద్ అదించించిన సహకారం స్వాతంత్య్ర ఉద్యమానికి మించినదని కొందరు అంటుంటారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తొలిసారిగా 2008 నవంబర్ 11న నిర్వహించారు. నాటి నుంచి ప్రతీటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
Tags
- National Education Day
- November 11th
- first celebrated in 2008
- education for students
- Education for rural poor and girls
- Education Sector
- Maulana Abul Kalam Azad
- First Minister of Education
- educational institutions
- IIT and UGC
- independence
- development in education
- free education
- mandatory education
- Universal Primary Education
- Current Affairs National
- Education News
- Sakshi Education News
- national current affairs
- Education minister of India
- November 11
- Indian education history
- education awareness
- Educational legacy
- India's education system
- educational reforms
- importance of education