Skip to main content

T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో.. వ‌ర‌ల్డ్ నంబర్‌వ‌న్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నంబర్‌వ‌న్‌ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.
Hardik Pandya Becomes No.1 Allrounder As ICC Updates T20I Rankings

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌లో హార్దిక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు.
 
హార్దిక్‌కు టీ20 వరల్డ్‌కప్‌ ఘనత
టీ20 వరల్డ్‌కప్‌-2024లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేసి, 11 వికెట్లు కూడా పడగొట్టాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌ వంటి ప్రోటీస్‌ టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లను ఔట్‌ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టాప్ 5 ర్యాంకింగ్స్‌లో మార్పులు.. 
➣ అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్‌ నబీ (1వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయాడు)
➣ ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్‌ స్టోయినిష్ (ఒక స్థానం ఎగబాకి 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు)
➣ జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా (4వ స్థానంలో నిలిచాడు)
➣ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (5వ స్థానంలో నిలిచాడు)

T20 World Cup: టి20 ప్రపంచకప్‌ విజేత భార‌త్‌.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Published date : 04 Jul 2024 03:40PM

Photo Stories