Paris Olympics: 14 ఏళ్లకే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధినిధి దేసింగు
Sakshi Education
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున బరిలోకి దిగనున్న అతి పిన్న వయస్కురాలిగా కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ ధినిధి దేసింగు గుర్తింపు పొందనుంది.
ధినిధి మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడుతుంది.
భారత్ నుంచి ఎవరూ పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని అందుకోలేకపోయారు. దాంతో చివరి అవకాశంగా అందుబాటులో ఉన్న రెండు ‘యూనివర్సాలిటీ’ బెర్త్‌లను భారత స్విమ్మింగ్ సమాఖ్య ఉపయోగించుకుంది. ధినిధి కాకుండా పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ భారత్ తరఫున ‘పారిస్’లో పోటీపడతాడు.
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగమ్మాయి ఈమెనే..
Published date : 29 Jun 2024 09:06AM