Henley Passport Index 2023: పాస్‌పోర్టు ర్యాంకింగ్‌లో భారత్ స్ధానం ఎంతంటే ?
‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2023’ తాజాగా శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది.ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోస్టు ఉన్న వారు వీసా లేకుండా, వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. గత ఐదేళ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న జపాన్ ఈసారి మూడోస్థానానికి చేరుకుంది.జపాన్ పాస్‌పోర్టు ద్వారా గతంలో 193 దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం 189 దేశాల్లో మాత్రమే పర్యటించవచ్చు.2022తో పోలిస్తే భారత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 85వ స్థానం నుంచి 80వ స్థానానికి చేరుకుంది.
☛☛ UPI in France: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన 'యూపీఐ’..
ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశ పాస్‌పోర్టులు ఉన్నవారు 190 దేశాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. ఈ పాస్‌పోర్టుతో 57 దేశాల్లో పర్యటించవచ్చు. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, లక్సెంబర్గ్(189 దేశాలు) మూడో స్థానంలో నిలిచాయి.
☛☛ H-1B visa holders: H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్... కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..!