Skip to main content

H-1B visa holders: H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌... కెన‌డా ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం ఇదే..!

అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌ వర్క్‌-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌ వెల్లడించారు.
H-1B visa holders
H-1B visa holders

ఈ ప్రొగ్రామ్‌ కింద హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు ఫ్రేజ‌ర్ తెలిపారు. హైటెక్‌ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

NMC: వైద్య విద్యార్థుల‌కు కీల‌క అప్డేట్‌... ఈ ఎగ్జామ్ పూర్తి చేసిన‌వారికే లైసెన్స్‌

H-1B visa

ఈ కంపెనీల్లో అధిక‌సంఖ్య‌లో హెచ్‌-1బీ వీసాదారులే ఉంటున్నారు. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో జులై 16, 2023 నాటికి హెచ్‌-1బీ వీసాలో అమెరికాలో పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఏర్పడింది.

బ్యాంకు ఉద్యోగుల‌కు భారీ షాక్‌... 35 వేల మందిని సాగ‌నంపేందుకు సిద్ధ‌మైన అంత‌ర్జాతీయ బ్యాంకు

తాజా కార్య‌క్ర‌మం కింద.. ఆమోదం పొందిన హెచ్‌-1బీ వీసాదారులకు మూడేళ్లకి ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. వీరి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం చేసుకోవ‌చ్చు.  చదువుకోవ‌చ్చు. అలాగే తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

canada

EPFO deadline: పింఛ‌న్‌దారుల‌కు గుడ్ న్యూస్‌... మ‌ళ్లీ గ‌డువు పెంపు... ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇమ్మిగ్రేషన్‌ స్ట్రీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని ఫ్రేజర్ తెలిపారు. హెచ్‌-1బీ వీసా దారుల్లో అత్యధికంగా భారతీయులే ఉంటారు. ఇటీవల‌ అమెరికాలో చాలా కంపెనీలు లేఆఫ్‌లు చేపట్టడంతో హెచ్‌-1బీ వీసాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరంతా అమెరికాలో కొనసాగాలంటే వేరే ఉద్యోగాలు వెతుక్కోక తప్పని పరిస్థితి. అలాంటి వారికి ఈ కెనడా ఆఫర్‌ ఉపయోగపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Published date : 28 Jun 2023 05:25PM

Photo Stories