Credit Suisse Layoffs 2023: బ్యాంకు ఉద్యోగులకు భారీ షాక్... 35 వేల మందిని సాగనంపేందుకు సిద్ధమైన అంతర్జాతీయ బ్యాంకు
ఈ సంస్థలో పనిచేసే వారిలో సగానికిపైగా ఉద్యోగులపై కొత్త యాజమాన్యం యూబీఎస్ వేటు వేయనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మార్చిలో అనిశ్చితి కారణంగా క్రెడిట్ సూయిజ్ దివాలా అంచున చేరిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక నష్టాల నుంచి బయటపడటంలో భాగంగానే స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో తెలిపింది.
ITBP Constable: పదో తరగతి అర్హతతో ఐటీబీపీలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
ఏడాదిలో మూడు దఫాలుగా లేఆఫ్‌లు ఉంటాయని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. జులై, సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ జరగనుందని పేర్కొంది. రాబోయే రెండు నెలల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఈ నెల ప్రారంభంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.
Railway Recruitment Cell: ఎలాంటి పరీక్ష లేదు... పది, ఐటీఐ మార్కులతో రైల్వేలో 4 వేల పోస్టులు... ఇలా అప్లై చేసుకోండి
క్రెడిట్ సూయిజ్ దివాలా అంచుకు చేరే నాటికి సంస్థలో 45,000 మంది సిబ్బంది ఉన్నారు. క్రెడిట్ సూసీ.. దాని సాల్వెన్సీ గురించి ఇన్వెస్టర్ల భయాలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దాదాపుగా కుప్పకూలింది. దీంతో స్విస్ ప్రభుత్వం భారీ బెయిలౌట్‌తో అండగా నిలవడంతో క్రెడిట్ సూయిజ్‌ను కొనుగోలు చేసేందుకు యూబీఎస్ గ్రూప్ ముందుకు వచ్చింది.