Skip to main content

ITBP Constable: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఐటీబీపీలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

ప‌దో త‌ర‌గ‌తి పాసైన వారికి శుభ‌వార్త‌. కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించ‌వ‌చ్చు. జీతం స్టార్టింగ్‌లోనే రూ.40 వేల వ‌ర‌కు అందుకునే అవ‌కాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు జులై 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి... ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ITBP Constable
ITBP Constable

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. తాజా నోటిఫికేష‌న్ ద్వారా 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. 

BIRED: ఫుడ్‌, బెడ్ ఫ్రీతో పాటు ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్ష‌ణ‌... ఇలా అప్లై చేసుకోండి

itbp

ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 458 పోస్టులు (జ‌న‌ర‌ల్‌- 195, ఎస్సీ- 74, ఎస్టీ- 37, ఓబీసీ- 110, ఈడబ్ల్యూఎస్‌- 42)

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయ‌సు: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21700 - రూ.69100.(అల‌వెన్సులు అద‌నం)

Railway Recruitment Cell: ఎలాంటి ప‌రీక్ష లేదు... ప‌ది, ఐటీఐ మార్కుల‌తో రైల్వేలో 4 వేల పోస్టులు... ఇలా అప్లై చేసుకోండి

itbp

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: జ‌న‌ర‌ల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-06-2023.

చివరి తేదీ: 26-07-2023.

వివ‌రాల కోసం recruitment.itbpolice.nic.in సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Inspirational Person: 82 ఏళ్ల వ‌య‌సులో సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ... ఎందుకు ఇచ్చారో మీకు తెలుసా..?

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 27 Jun 2023 03:30PM
PDF

Photo Stories