Skip to main content

Germany Work Visa: జర్మనీలో జాబ్‌.. ఇదే మంచి అవకాశం! ఎందుకో తెలుసా?

Germany Work Visa

జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. జర్మనీ వర్క్‌ వీసా ప్రాసెస్ చేయడానికి గతంలో 9 నెలలు పట్టేది. ఇప్పుడు దానిని కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు.

తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ తెలిపారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించనున్నారు. మింట్ నివేదిక ప్రకారం.. జర్మన్ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం, జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. వర్క్ వీసా ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కలిగిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది.

EAPCET Final Phase Of Counselling: ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల

జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మన్ ఆర్థిక వ్యవస్థ 74 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ ప్రకారం, ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకు 80 వేల వర్క్ వీసాలను జారీ చేసింది. వీరిలో 50 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు.

Bank Jobs: ఇండియన్‌ బ్యాంక్‌లో స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్‌..

కాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టు 14న జర్మన్ ఎంపీలు జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్‌లను కలిశారు. దీనిపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ఢిల్లీలో జుర్గెన్ హార్డ్ , రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు.
 

Published date : 17 Aug 2024 03:38PM

Photo Stories