Skip to main content

Golden Visa: ఆస్ట్రేలియా గోల్డెన్‌ వీసా రద్దు..!

విదేశీయులు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా, అక్కడే కొన్ని రోజులు నివసించేందుకు అనువుగా జారీచేస్తున్న ‘గోల్డెన్‌ వీసా’లను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
 Australia tightens immigration rules   Government decision  Australia ends Golden Visa program for wealthy investors   Australian government cancels golden visas for foreign investors

ఈ వీసా ప్రోగ్రామ్‌ ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీసాల స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు పేర్కొంది.

గోల్డెన్‌ వీసా నిబంధనల ప్రకారం కనీసం రూ.27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2012లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. హోంశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్‌ కింద ఆసీస్‌లో ఉండేలా అవకాశం సంపాదించారు. ఇందులో 85శాతం చైనా మిలియనీర్లు ఉన్నారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్‌లను రద్దు చేశాయి.

Donald Trump: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు.. అత్యధికంగా 51 శాతం ఓట్లు కైవసం

Published date : 24 Jan 2024 09:15AM

Photo Stories