Nobel Prize in Chemisty 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీతలు వీరే...
Sakshi Education
రసాయన శాస్త్రానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
2023 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ నోబెల్ బహుమతి ప్రకటించింది. నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలకు గానూ అమెరికాకు చెందిన మౌంగి జి. బావెండి, లూయిస్ ఇ. బ్రస్, అలెక్సీ ఐ. ఎకిమోవ్‌లకు నోబెల్ ప్రైజ్ ప్రకటించారు.
Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్
క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష‍్మమైన నానోపార్టికల్స్. నానోటెక్నాలజీలో ఈ క్వాంటమ్ డాట్స్‌ను ప్రస్తుతం టెలివిజన్‌లు, ఎల్‌ఈడీ దీపాలతో పాటు అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా ఇవి కణితి కణజాలాన్ని తొలగించినప్పుడు సర్జన్‌లకు కూడా ఇవి మార్గనిర్దేశం చేయగలవు.
Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్, వెయిస్‌మన్‌కు నోబెల్
Published date : 09 Oct 2023 05:35PM