Skip to main content

Civils Rankers: అతి పిన్న వ‌య‌సులో ఐఏఎస్ అయ్యింది వీరే... వీరి కుటుంబ నేప‌థ్యం ఏంటంటే...

అఖిల భార‌త స‌ర్వీస్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్ర‌తీ ఏడాది యూపీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేస్తుంది. దేశ వ్యాప్తంగా సుమారు 10 ల‌క్ష‌ల నుంచి 12 ల‌క్ష‌ల మంది ఈ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటుంటారు. వీరిలో కేవ‌లం 1 శాతం మంది కూడా అర్హ‌త సాధించ‌లేక నిరాశ‌తో వెనుదిరుగుతుంటారు.
Youngest IAS Toppers
అతి పిన్న వ‌య‌సులో ఐఏఎస్ అయ్యింది వీరే... వీరి కుటుంబ నేప‌థ్యం ఏంటంటే...

ఇలాంటి అత్యంత క‌ష్ట‌మైన ప‌రీక్ష‌ను కేవ‌లం 21 ఏళ్ల‌కే పాస్ అవ్వ‌డం అంటే విశేష‌మే క‌దా. అదీ కూడా ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే విజ‌యం సాధించారంటే వారెంత ప్ర‌తిభావంతులో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా చ‌దువుకుంటూ, ప్ర‌తీ రోజు 10, 12 గంట‌ల సాధ‌న‌తోనే తాము విజ‌యం సాధించిన‌ట్లు అభ్య‌ర్థులు చెబుతుంటారు. 

IAS Success Story: 16 ఏళ్ల‌కే వినికిడి శ‌క్తి కోల్పోయా... కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే ఐఏఎస్ సాధించానిలా...

యూపీఎస్సీ ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని వంద‌ల నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. అయితే కేవ‌లం 21, 22 ఏళ్ల వ‌య‌సులోనే అత్యంతక్లిష్ట‌మైన సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన వారి వివ‌రాలు ఇక్క‌డ తెలుసుకుందాం. 

Ansar Ahmad Shaikh
Ansar Ahmad Shaikh

1. అన్స‌ర్ అహ్మ‌ద్ షేక్ ఇత‌ను 21 ఏళ్ల వ‌య‌సులోనే సివిల్స్ ప‌రీక్షలో ఉత్తీర్ణ‌త సాధించి శ‌భాష్ అనిపించుకున్నాడు. మ‌హారాష్ట్ర‌కు చెందిన అన్స‌ర్ 2016 సీఎస్ఈ(సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్‌)లో ఆల్ ఇండియా 361 ర్యాంకు సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు అత్యంత పిన్న వ‌య‌సులో ఈ ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించిన వారిలో ఇత‌నే మొద‌టిస్థానంలో ఉన్నాడు.

2. రోమ‌న్ సైనీ... ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇత‌ని పేరే మార్మోగిపోతోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంట‌నే సీఎస్ఈ ప‌రీక్ష రాశాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే ఆల్ ఇండియా 18వ ర్యాంకు(2013 ఫ‌లితాలు) సాధించాడు. ఇత‌నిది రాజ‌స్థాన్‌. అయితే ఐఏఎస్ అయిన రెండేళ్ల‌కే ఉద్యోగానికి రాజీనామా చేసి అన్అకాడ‌మీ పేరుతో స్టార్ట‌ప్ స్థాపించి.. వేల కోట్ల రాజ్యానికి అధిప‌తిగా ఉన్నాడు. 

క‌రెంట్ అఫైర్స్ కోసం వీటినే ఫాలో అయ్యా... యూట్యాబ్ సాయంతో కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంకు సాధించానిలా...

Roman Saini
Roman Saini

3. స్వాతి మీనా నాయ‌క్‌... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్ది రోజులు బాగా వినిపించింది. రాజ‌స్థాన్‌కు చెందిన స్వాతి 2007లో ఆల్ ఇండియా 260వ ర్యాంకు సాధించింది. మ‌ధ్య ప్ర‌దేశ్ కేడ‌ర్‌కు ఈమెను కేటాయించారు. ఆ రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో ఈమె పేరు దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. 

4. అలాగే మ‌హారాష్ట్ర‌కు చెందిన అమ‌`తేష్ 2011లో 22 ఏళ్ల వ‌య‌సులో పాస‌య్యి టాప‌ర్ల జాబితాలో నిలిచారు.

5. పంజాబ్‌కు చెందిన అంకుర్ గార్గ్ 2013లో 22 ఏళ్ల వ‌య‌సులోనే సీఎస్ఈ ప‌రీక్ష ఉత్తీర్ణుడ‌య్యారు. 

Success Story: వ‌రుస‌గా నాలుగు సార్లు ఫెయిల్‌...ఏడేళ్ల నిరీక్ష‌ణ‌.. చివ‌రికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...

Swati Meena Naik
Swati Meena Naik

రాజ‌స్థాన్‌కు చెందిన గౌర‌వ్ గోయ‌ల్ 2006లో త‌న 22 ఏళ్ల వ‌య‌సులో సీఎస్ఈ ప‌రీక్ష ఉత్తీర్ణుడ‌య్యారు. 

ఢిల్లీకి చెందిన టినా దాబి 2015లో 22 ఏళ్ల వ‌య‌సులో సీఎస్ఈ ప‌రీక్ష ఉత్తీర్ణురాలైంది. ఈమె ప‌లుసార్లు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. ఇటీవ‌లే రెండో పెళ్లి చేసుకుని వార్త‌ల్లోకెక్కింది. 

కేర‌ళ‌కు చెందిన ఎస్ సుశ్రీ 2017లో నిర్వ‌హించిన సీఎస్ఈ ప‌రీక్ష‌ల్లో 22ఏళ్ల వ‌య‌సులో ఉత్తీర్ణుల‌య్యారు.

Published date : 18 Jul 2023 05:13PM

Photo Stories