Skip to main content

AP Government Jobs 2023: 3,295 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్‌..

teacher jobs in andhra pradesh

సాక్షి, అమరావతి: దావోస్‌ పర్యటనలో భాగంగా ఏపీ విద్యా సంస్కరణల్లో సీఎం జగన్‌ విజన్‌ నచ్చి.. బైజూస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఉచితంగా కంటెంట్‌ అందించేందుకు ముందుకొచ్చి­ంది. ఆ తర్వాత  5.18 లక్షల ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా అందించాం. దీనివల్ల 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.

చ‌ద‌వండి: NMMS Scholarships: కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా.. ఏడాదికి రూ.12వేల స్కాలర్‌షిప్‌

ఒక్కో విద్యార్థికి టోఫెల్‌ టెస్టు ఫీజు రూ.7.50 మాత్రమే..
విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పెంచేలా టోఫెల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌ (ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసు)తో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోని 3–9వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌ ప్రైమరీ, జూనియర్‌ శిక్షణ ఇస్తున్నాం. ప్రైమరీలో 6.31లక్షలు, జూనియర్‌లో 14.39లక్షల మంది విద్యార్థులు కలిపి మొత్తం 20.70 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విద్యార్థికి ఆన్‌లైన్‌ టెస్టు ఫీజు కింద కేవలం రూ.7.50 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఇందుకు రూ.1.50 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో అర్హత సాధించిన వారిలో ఆ తర్వాతి దశలో ప్రైమరీ, జూనియర్‌ విభాగాల్లో 40వేల మంది చొప్పున మాత్రమే ఓరల్‌ టెస్టు (సర్టిఫికేషన్‌)కు హాజరవుతారు. వీరికి టోఫెల్, ఏపీ ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్‌ కోసం రూ.600 చెల్లిస్తాం. ఇందుకు రూ.4.80 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ లెక్కన తొలి ఏడాది రూ.6.35 కోట్లు మాత్రమే టోఫెల్‌ శిక్షణకు ఖర్చుచేస్తున్నాం.

2027–28 నాటికి రూ.145కోట్లే ఖర్చు..
ఇక విద్యార్థులకు టోఫెల్‌లో రెండో ఏడాది నుంచి జూనియర్‌ స్పీకింగ్‌ టెస్టు ఉంటుంది. ఇందుకు రూ.2, 500 చెల్లిస్తాం. 5వేల విద్యార్థులతో స్పీకింగ్‌ టెస్టు మొదలుపెట్టి ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచుతాం. ఇంతచేసినా 2027–28 నాటి కి టోఫెల్‌ శిక్షణకు రూ.145 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అలాగే, తమ ప్రభుత్వంలో నాణ్యమైన ఇంటరాక్టీవ్‌ ప్యాన్సల్‌ను రూ.1.25లక్షలకు కొనుగోలు

చ‌ద‌వండి: AP PGT Counseling: మోడల్‌ స్కూల్స్‌లో పీజీటీ పోస్టులకు కౌన్సెలింగ్‌ నేడు

3,295 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్‌..
ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేస్తున్నాం. వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 3,295 అధ్యాపక పోస్టులకు సోమవారం నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. డీఎస్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ విశాఖ కేంద్రంగా ఉంటూ పర్యవేక్షించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయ­లసీమ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.

Published date : 13 Oct 2023 05:20PM

Photo Stories