Skip to main content

AP PGT Counseling: మోడల్‌ స్కూల్స్‌లో పీజీటీ పోస్టులకు కౌన్సెలింగ్‌ నేడు

AP PGT Counseling

మధురవాడ: విద్యాశాఖ విశాఖ జోన్‌–1 ఆర్‌జేడీ ఆఫీస్‌ పరిధిలోని ఏపీ మోడల్‌ స్కూళ్లలో పీజీటీ పోస్టులకు 83 దరఖాస్తులు అందాయని ఆర్‌జేడీ జ్యోతి కుమారి తెలిపారు. 49 పోస్టులకు గాను అక్టోబర్ 12 గురువారం దరఖాస్తులను స్వీకరించినట్లు తెలియజేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, అక్టోబర్ 13 శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నామని తెలిపారు. ఇంగ్లిష్‌ –7, మ్యాథ్స్‌–7, కెమిస్ట్రీ–5, ఎకనామిక్స్‌–8, బోటనీ–4, ఫిజిక్స్‌–4, సివిక్స్‌–7, కామర్స్‌–4, జువాలజీ–3 చొప్పున ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నట్టు జ్యోతికుమారి చెప్పారు. కార్యక్రమంలో ఏడీ శ్రీరామమూర్తి పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Free Training: స్వయం ఉపాధితోనే భవిత పదిలం

Published date : 13 Oct 2023 03:18PM

Photo Stories