Free Training: స్వయం ఉపాధితోనే భవిత పదిలం
అనంతపురం: ఉద్యోగం చేయడం కంటే పది మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రతి ఒక్కరికీ వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రూడ్‌సెట్ పనితీరు అభినందనీయమని కెనరా బ్యాంక్ డీజీఎం రాంప్రసాదరెడ్డి అన్నారు. అక్టోబర్ 12న గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రూడ్‌సెట్ అడ్వైయిజరీ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా నాణ్యమైన శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్న రూడ్‌సెట్ సేవలను కొనియాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు జీవితంలో నిలదొక్కుకునేలా అనుక్షణం పర్యవేక్షిస్తున్న తీరును అభినందించారు. ఈ మూడు నెలల్లో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తి చేసినట్లు రూడ్‌సెట్ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి తెలిపారు. రూడ్‌సెట్‌లో శిక్షణ పొంది రూ.10 లక్షల పెట్టుబడితో సొంతంగా టూ వీలర్ మెకానిక్ షాప్‌ను ఏర్పాటు చేసుకున్న మోహన్‌రెడ్డి, దాదాపీర్, అనూరాధ, షాహీన్‌ను అభినందించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం అనూరాధ, ఉభయ జిల్లా ఎల్‌డీఎంలు సత్యరాజు, రమణకుమార్, డీఐసీ జీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Study Abroad in USA: యూఎస్‌లో క్రేజీ కోర్సులు.. వీసాకు కావల్సిన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Tags
- Free training
- Unemployed Youth
- Free training for unemployed youth
- Self Employment Opportunities
- Rudset training courses
- rudset institute
- Education News
- Employment News
- Skill Development
- Sakshi Education Latest News
- career growth
- DGM Canara Bank
- Canara Bank is a Rural Self-Employment Training Institute
- Job Creation
- sakshi education job applications
- Latest jobs 2023