Inspirational Success Story : రోజుకు రూ.3 కోట్లు విరాళం.. గొప్ప పరోపకారి ఇతనే.. కానీ..
ఇలాంటి కోవకు చెందిన వారే.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. ఈ నేపథ్యంలో శివ్ నాడార్ సక్సెస్ స్టోరీ మీకోసం..
భారీగా విరాళాలిచ్చే..
పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్ నాడార్ (జూలై 14) 78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్-మేడ్ ఇండియన్ బిలియనీర్ శివ నాడార్ తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్‌ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై శివ నాడార్ ఫౌండేషన్, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భారీగా విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా.
☛ Success Story : చదువులో ఫెయిలయ్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?
ఎక్కడ పుట్టారంటే..
తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్. కోయంబత్తూర్‌లోని పిఎస్‌జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్‌చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్‌లో కరియర్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు.
హెచ్‌సీఎల్ ఆవిర్భావం ఇలా..
ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్‌ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్‌తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది.1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఆవిష్కరించారు.హెచ్‌సీఎల్‌ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ.20 లక్షల అదనపు గ్రాంట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హెచ్‌సీఎల్‌టెక్ లిస్ట్ అయింది.
దేశంలో తొలిసారిగా..
ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్‌సీఎల్ 8సీ తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్ దక్కించుకున్నారు. సొంత యాజమాన్య హార్డ్‌వేర్‌తో హార్డ్‌వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే రూ.10 లక్షల అమ్మకాలతో 1979 నాటికి రూ.3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను ప్రాధాన్యతను అప్పట్లోనే పసిగట్టి, ఇందుకోసం సింగపూర్‌కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు.
తన బాధ్యతల నుంచి..
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, 2022లో, సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు అని అంచనా. 2020లో దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్‌గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. శివసుబ్రమణ్య నాడార్ పేరుతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్‌ను స్థాపించాడు.తండ్రికి తగ్గ కూతురిగా రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" స్థాపించడం విశేషం.
ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం..
డెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్ టాప్‌లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం గొప్ప పరోపకారిగా నిలిచారు.
➤ Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వచ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!
Tags
- HCL Founder Shiv Nadar Success Story
- HCL Founder Shiv Nadar Inspire Story
- HCL Founder Shiv Nadar Family
- HCL Founder Shiv Nadar Real Life Story in Telugu
- Success Stories
- Inspire
- motivational story in telugu
- HCL
- hcl founder shiv nadar charity
- hcl founder shiv nadar charity fund
- sakshi education successstories