Inspirational Story: మట్టిలో మాణిక్యం... రైతు కుటుంబంలో పుట్టి నేడు వేల కోట్లకు అధిపతి అయ్యాడిలా
కేరళ కొల్లాం తీరప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రవి పుట్టారు. చిన్ననాటి నుంచే ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. తరువాత చిట్-ఫండ్ కంపెనీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నష్టాలపాలయ్యాడు.
చదవండి: రోడ్ల వెంట తిరుగుతూ సేల్స్ గర్ల్‌గా చేసింది... ఇప్పుడు కోటీశ్వరాలు అయ్యిందిలా
70 వేల మందికి ప్రత్యక్షంగా....
ఆ తరువాత 150 మందితో ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించాడు. క్రమంగా తన ఎదుగుదల ప్రారంభమైంది. ఈ రోజు ఆ కంపెనీలో 70,000 మంది పని చేస్తున్నారు. ది రావిజ్ అష్టముడి, ది రవిజ్ కోవలం, ది రవిజ్ కడవు లాంటి 5 స్టార్ హోటళ్లను రవి పిళ్లై సమర్థవంతంగా నడుపుతున్నారు. చిన్ననాటి నుంచి కష్టపడే తత్వమే తనను ఈ స్థాయికి తెచ్చిందని సంతోషంగా చెప్తారు రవి పిళ్లై. తన విజయానికి కృషి, పట్టుదలే కారణమని చెప్తారు. దేశానికి రవి చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ తో గౌరవించింది. 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
చదవండి: సివిల్స్ లో టాపర్... వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు
రూ.64 వేల కోట్లు...
పేదరికంతో పోరాడుతున్న రైతు కొడుకుగా జన్మించిన రవి పిళ్లై ఆర్‌పీ గ్రూప్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ కంపెనీ వ్యాల్యూ 7.8 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 64 వేల కోట్లు. లగ్జరీ హోటల్స్, స్టీల్, గ్యాస్, ఆయిల్, సిమెంట్, షాపింగ్ మాల్స్ వంటి వ్యాపారాల్లో రవి పిళ్లై తనదైన ముద్ర వేశారు. కష్టపడితే సాధించలేనిదంటూ ఉండదని పిళ్లై చెబుతారు. స్వయంకృషితో ఎదిగిన రవిపిళ్లై మనకందరికి స్ఫూర్తిదాయకమే.