Salary Hikes : ఈ రంగంలోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న శాలరీలు.. ఊహించిన దానికంటే ఎక్కువగానే..!
టైమ్స్ కథనం ప్రకారం.. టెలికాం దిగ్గజాలైన రిలయన్స్, ఎయిటెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు వారి ఉద్యోగుల జీతాల్ని ఈ ఏడాదిలో 10 నుంచి 12 శాతం వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది పెంచిన శాలరీ 7.5శాతంగా ఉండగా.. ఈ ఏడాది అత్యధికంగా పెంచే యోచనలో ఉన్నాయని, పైన పేర్కొన్న మూడు టెలికాం సంస్థలు ఉద్యోగులకు కనీసం 8 నుంచి 12 శాతం శాలరీ హైక్ చేయోచ్చని టైమ్స్ తన కథనంలో హైలెట్ చేసింది.
గవర్నమెంట్ శాఖల్లో..
టెలికాం కంపెనీలు జీతాలు పెంచుతున్నట్లు తమకు సమాచారం అందించాయని ఐటీ,ఐటీఈఎస్,మీడియా, గవర్నమెంట్ శాఖల్లో స్టాఫింగ్ సర్వీస్ సంస్థ టీం లీజ్ సర్వీస్ వెల్లడించింది. అంతేకాదు ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల జీతాలు పెంచామని,జులై నుంచి మిగిలిన వారి జీతాలు పెంచుతున్నామని టీం లీస్ సర్వీస్ బిజినెస్ హెడ్ దేవాల్ సింగ్ తెలిపారు.
ఉద్యోగులు జీతాలు ఊహించిన దానికంటే..
టెలికాం రంగంలో దేశ వ్యాప్తంగా 4 మిలియన్ల మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే టెలికాం రంగంలో టక్నాలజీ అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న ఉద్యోగులు జీతాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరగనున్నట్లు టీంలీస్ సర్వీస్ పేర్కొంది. 5జీ సర్వీసుల వినియోగంతో మార్కెట్‌లో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, వారి ఎంపిక విషయంలో సైతం కంపెనీలు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.