Forbes: ఉద్యోగాలకు ఉత్తమ కంపెనీల (ఎంప్లాయర్స్) జాబితా
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 750 కంపెనీల లిస్టులో 52వ స్థానంలో నిల్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ అంశాలకు సంబంధించి ఉద్యోగులు తమ తమ సంస్థలకు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా మార్కెట్ రీసెర్చ్ కంపెనీ స్టాటిస్టాతో కలిసి ఫోర్బ్స్ ఈ లిస్టును రూపొందించింది. 58 దేశాల్లో సుమారు 1,50,000 మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ వర్కర్లు ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ‘తాము పనిచేస్తున్న కంపెనీలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సిఫార్సు చేసే విషయంలో ఆయా సంస్థలకు రేటింగ్ ఇవ్వాలని ఉద్యోగులను కోరాము. అలాగే ఆయా పరిశ్రమల్లో తమ కంపెనీల పనితీరును కూడా మదింపు చేయమని అడిగాము. అత్యధిక మార్కులు దక్కించుకున్న 750 కంపెనీలతో లిస్ట్ తయారు చేశాము‘ అని ఫోర్బ్స్ వెల్లడించింది. కంపెనీ ఇమేజీ, నిపుణులను అభివృద్ధి చేసుకోవడం, లింగ సమానత, సామాజిక బాధ్యత తదితర అంశాలను కూడా ర్యాంకింగ్‌కు ప్రాతిపదికగా తీసుకున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎల్రక్టానిక్స్ అగ్రస్థానంలో నిల్చింది. అమెరికన్ దిగ్గజాలు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్ టెక్నాలజీస్ మొదలైనవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనాకు చెందిన హువావే 8వ ర్యాంకు దక్కించుకుంది.
టాప్ 100లో ఐసీఐసీఐ..
ఉత్తమ ఎంప్లాయర్స్ లిస్టులో టాప్ 100 ర్యాంకింగ్స్‌లో దేశీ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ (65), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (77), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (90)లో చోటు దక్కించుకున్నాయి. ఇక ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ (119), లార్సన్ అండ్ టూబ్రో (127), ఎల్‌ఐసీ (504), ఇన్ఫోసిస్ (588), టాటా గ్రూప్ (746) తదితర సంస్థలు కూడా జాబితాలో నిల్చాయి.
చదవండి:
APPSC: ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్