Skip to main content

Telangana MBBS Seats Increased : తెలంగాణ‌లో మొత్తం 8,915కు పెరిగిన‌ ఎంబీబీఎస్ సీట్లు.. పూర్తి వివ‌రాలు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ మెడిక‌ల్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో కొత్త‌గా ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన విష‌యం తెల్సిందే.. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరింది.
Telangana MBBS Seats Increased  Number of MBBS seats in Telangana government and private medical colleges

అలాగే ఎంబీబీఎస్‌(MBBS) సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది.

➤ Telangana High Court Orders : బ్రేకింగ్ న్యూస్‌.. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...ఇక‌పై ఈ విద్యార్థులు కూడా ఈ కోట‌లోనే..

కొత్త‌గా 400 ఎంబీబీఎస్ సీట్లు..
తెలంగాణ‌లో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 10వ తేదీన మ‌రో 4 కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్‌ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది.గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 

Published date : 11 Sep 2024 01:48PM

Photo Stories