JNTU-N: క్రమశిక్షణతోనే ఉన్నత స్థానాలకు.. Additional Sr. Civil Judge K. Madhuswamy
నరసరావుపేటఈస్ట్: క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని అడిషినల్ సీనియర్ సివిల్ జడ్జి కె.మధుస్వామి తెలిపారు. జేఎన్‌టీయూ–ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి మధుస్వామి మాట్లాడుతూ ర్యాగింగ్ అనాగరిక చర్యగా పేర్కొన్నారు.
Also read: University: విద్యతోనే అభివృద్ధి: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
సహచర విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. చదువుపై శ్రద్ధ ఉన్న విద్యార్థి ర్యాగింగ్‌కు దూరంగా ఉంటాడ నీ, చదువు పట్ల నిర్లక్ష్యం వహించే విద్యార్థి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి చట్టం చేతికి చిక్కుతాడని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు, కళాశాలకు గౌరవం తీసుకవచ్చేలా జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల వైస్‌ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.శోభన్‌బాబు మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన 2016 నుంచి ఇప్పటి వరకు ఒక్క ర్యాగింగ్ సంఘటన కూడా నమోదు కాలేదని తెలి పారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతారని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి.పి.రాజు, మానసిక వైద్యులు డాక్టర్ సతీష్, కె.ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.గోపాలకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
Also read: UP స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం: ‘ప్యాడ్ బ్యాంక్’