Degree Colleges: డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
విద్యార్థులకు టీటీడీకి చెందిన కళాశాలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు వెల్లడించిన తేదీలోగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.
Spot admissions for degree colleges
సాక్షి ఎడ్యుకేషన్: టీటీడీకి చెందిన శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఎస్వీ ఓరియంటల్ కళాశాల, ఎస్వీ సంగీత, నృత్య కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని టీటీడీ అధికారులు తెలిపారు.
స్పాట్ అడ్మిషన్లు పొందిన వారికి హాస్టల్ వసతి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవు. అభ్యర్థులు ఈ విషయాన్ని పరిగణించి అడ్మిషన్లు పొందవచ్చని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.