Employment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ... అనేక రకాల కోర్సులు, ఉపాధి ఉద్యోగాల కల్పన!!
సాక్షి ఎడ్యుకేషన్: వెంకటగిరిలో చేనేత కార్మికుల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని 1992లో భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించారు. ఏపీ హ్యాండ్లూమ్స్ – టెక్స్‌టైల్స్ కమిషనర్ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన, ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు అనేక రకాల కోర్సులు అందిస్తూ, ఉపాధి ఉద్యోగాల కల్పనలో ముందుంది. దీన్ని నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వెంకటగిరి శాసనసభ్యుడుగా ఎంపికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు.
Navodaya Admissions: నవోదయ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా చేనేత కార్మికులు మరింత నైపుణ్యాన్ని సంపాదించుకోవడంతోపాటు వారు తయారు చేస్తున్న చేనేత వస్త్రాలకు ఏఏ రాష్ట్రాల్లో, డిమాండ్ ఉందో గుర్తించి, ఆయా ప్రాంతాలకు పంపడానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
Job Mela: జాబ్‌మేళాలో 232 మంది ఎంపిక
ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా ఉంది
వెంకటగిరి చేనేత కార్మికులకు ప్రభుత్వం సాయం మెండుగా ఉంది. నేతన్న నేస్తంతోపాటు ప్రభుత్వం కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. ప్రధానంగా అర్హులందరికీ సిఫార్సు లేకుండా పథకాలను అందజేస్తోంది. నిజమైన చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడింది. దానికి తగినట్లుగా నేత కార్మికులు మరింత ఉత్సాహంగా చీరలునేస్తున్నారు. వెంకటగిరికి వస్తున్న ఢిల్లీ బృందానికి ఇక్కడి ప్రత్యేకతలను, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వివరంగా చెబుతాం.
–ఎన్.విజయకుమార్, చేనేత కార్మికుడు, వెంకటగిరి
BRAOU: అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
నిశిత పరిశీలన
వెంకటగిరి చేనేత వస్త్రాలను నిశితంగా పరిశీలించడానికి ఢిల్లీ బృందం మంగళవారం రానుంది. అన్ని అంశాలను వారు నిశితంగా పరిశీలించి, నివేదికను అందిస్తారు. వెంటగిరి చేనేత ఉత్పత్తులతోపాటు రాష్ట్రంలో 12 రంగాలను ఎంపిక చేశారు. బృందం కార్మికులతోనూ నేరుగా మాట్లాడుతుంది. ఆ మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాం. కార్మికులందరూ కమిటీకి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాం.
–బీపీ రావు, అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్స్, తిరుపతి జిల్లా
Selfie with Toppers: ప్రభుత్వ పాఠశాలల్లో 'సెల్ఫీ విత్ టాపర్స్'
జాతీయ అవార్డు ఆశిద్దాం
వెంకటగిరిలోని చేనేత ఉత్పత్తులు చీరలు, చేనేతల అభివృద్ధిని పరిశీలించేందుకు ఇన్వెస్ట్ ఇండియా కమిటీ ప్రతినిధి జిగీష తివారి మిశ్రా బృందం మంగళవారం వస్తోంది. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రోడక్ట్‌లో భాగంగా కమిటీ చేనేత వస్త్రాల నాణ్యతా ప్రమాణాలు, ప్రత్యేకతలపై తనిఖీలు చేపట్టనుంది. అంతేకాకుండా కార్మికుల పోత్సాహానికి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని తెలుసుకోనుంది. కార్మికులతో ముఖాముఖి చర్చింనుంది. ఈ జాతీయ అవార్డు వెంకటగిరి చేనేతకు దక్కాలని ఆశిద్దాం.
–కే.వెంకటరమణారెడ్డి, కలెక్టర్, తిరుపతి జిల్లా