NO Admissions in IIHT: ఐఐహెచ్‌టీలో ఈ ఏడాది అడ్మిషన్లు లేనట్లే!.. కారణం ఇదే..
ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు చేసే విద్యార్థులకు ఈ ఏడాది కూడా ఏపీ, ఒడిశాలోని ఐఐహెచ్‌టీల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు.
మరోవైపు ఐఐహెచ్‌టీ తెలంగాణలో డిగ్రీ, డిప్లొమా కోర్సుల ప్రారంభానికి ఏఐసీటీఈ అనుమతి కోరుతూ ఈ ఏడాది డిసెంబర్‌లోగా దరఖాస్తు చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు భావిస్తున్నారు.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు!
నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో గతంలో ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ పార్కును బహిరంగ వేలంలో ఇటీవల రాష్ట్ర నేత కార్మికుల సహకార సంస్థ (టెస్కో) దక్కించుకుంది.
ఖాళీగా ఉన్న ఈ పార్కులో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే తరగతుల ప్రారంభానికి అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు లేకపోవడంతో వచ్చే ఏడాది నుంచే విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశముంది.
>> College Predictor - 2024 AP EAPCET | TS EAPCET
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పది ఐఐహెచ్‌టీలు పనిచేస్తుండగా, వీటిలో ఆరు కేంద్ర ప్రభుత్వ నిధులతో, నాలుగు ఆయా రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్నాయి. వారణాసి (యూపీ), సేలం (తమిళనాడు), గువాహతి (అసోం), జో«థ్‌పూర్ (రాజస్థాన్), బార్‌ఘడ (ఒడిశా), ఫుల్లా (పశ్చిమ బెంగాల్) ఐఐహెచ్‌టీలు కేంద్ర నిధులతో నడుస్తున్నాయి.
వెంకటగిరి (ఏపీ), గదగ్ (కర్ణాటక), చంపా (చత్తీస్‌గడ్), కన్నూరు (కేరళ) ఐఐహెచ్‌టీలు ఆయా రాష్ట్రాల ఆర్థిక సాయంతో నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం పలు సందర్భాల్లో కోరినా కేంద్రం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ర ప్రభుత్వమే ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు ముందుకు రావడంతో కేంద్రం అంగీకరించింది.
>> TS EAPCET Cutoff Ranks 1st phase | 2nd | Final | Spl
ఏపీ, ఒడిశా ఐఐహెచ్‌టీల్లో ప్రవేశాలు
తెలంగాణ విద్యార్థులకు ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఐఐహెచ్‌టీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత ఒడిశాలోని బార్‌ఘడ ఐఐహెచ్‌టీలో 9 సీట్లు కేటాయిస్తున్నారు.
రంగుల అద్దకం, నేత, ప్రింటింగ్, ఫ్యాబ్రిక్ టెక్నాలజీ కోర్సులు తదితర కోర్సులకు ఐఐహెచ్‌టీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తెలంగాణలో నేత రంగం ఆ«ధునీకరణ, వస్త్ర పరిశ్రమలో సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా ఈ కోర్సులు ఉపయోగపడుతాయి.