Selfie with Toppers: ప్రభుత్వ పాఠశాలల్లో 'సెల్ఫీ విత్ టాపర్స్'
పాఠశాలలు ఏలూరు పశ్చిమ జిల్లా గోదావరి
ప్రాథమిక | 1,346 | 1,062 |
ప్రాథమికోన్నత | 199 | 83 |
ఉన్నత | 262 | 207 |
విద్యార్థులు | 1,47,730 | 1,08,606 |
ఎస్‌ఆర్‌కేఆర్‌కు బెస్ట్ అవార్డు
సాక్షి, భీమవరం: కేంద్ర ప్రభుత్వ ఉన్నత భారత్ అభియాన్ (యూబీఏ)లో భాగంగా దత్తత గ్రామాల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందిస్తున్న సాంకేతిక ప్రగతికి ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ అవార్డు ప్రదానం చేసిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్‌వర్మ తెలిపారు. శనివారం కళాశాలలో ఆయన వివరాలు వెల్లడించారు. యూబీఏ నిర్వహణలో కృషికి వెబ్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ టి.రాంబాబుకు బెస్ట్ కో–ఆర్డినేటర్ అవార్డు కూడా లభించిందన్నారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు తమ ఇంజనీరింగ్ కళాశాల కాళ్ల మండలంలోని పెద అమిరం, కోపల్లె, జక్కరం, కాళ్ల, కాళ్లకూరు గ్రామాలను దత్తత తీసుకుని పలు కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, రాంబాబును సత్కరించారు. ఆర్‌అండ్‌డీ డీన్, యుబీఏ సెల్ కో–ఆర్డినేటర్ పీఏ రామకృష్ణంరాజు, ఆర్.సుబ్బారావు, జి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యారంగంలో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు. మనబడి నాడు–నేడులో కార్పొరేట్ తరహాలో సర్కారీ బడులను తీర్చిదిద్దారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారిలో పోటీతత్వాన్ని పెంచేలా 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో నగదు బహుమతులు అందిస్తున్నారు. ఇదే కోవలో ఇప్పు డు సెల్ఫీ విత్ టాపర్స్ అనే వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు.
చదవండి: Children's Day Celebration: అక్టోబర్ 26 నుంచి బాలల దినోత్సవ పోటీలు
విజయాలకు గుర్తుగా..
సాధారణంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులతో సెల్ఫీలు దిగడానికి పోటీలు పడటం చూస్తుంటాం. పేరు, ప్రఖ్యాతులు కలిగిన ప్రముఖులను కలిశామనే తీపి గుర్తును పది కాలాల పాటు దాచుకోవడానికి ఇటువంటివి జరుగుతుంటాయి. ఆ కోవలోనే విద్యార్థులు కూడా తాము సాధించిన విజయాలు వారికి తీపిగుర్తులుగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం సెల్ఫీ విత్ టాపర్స్ అనే కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఇక్కడ మాత్రం విజయాలు సాధించిన విద్యార్థులతో ప్రముఖులే సెల్ఫీలు దిగడం ప్రత్యేకత.
ఎఫ్‌ఏ–2 పరీక్షల నుంచే అమలు
సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం ఎఫ్‌ఏ–2 పరీక్షల నుంచే అమలుచేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకూ నిర్వహించిన ఈ పరీక్షల్లో పాఠశాల స్థాయిలో టాపర్ల ఎంపిక ప్రక్రియను ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఈ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టు టీచర్లు జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇలా పాఠశాల స్థాయిలో ప్రతి తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించారు. అలా గుర్తించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సెల్ఫీలు దిగుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
తోటి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా..
సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం కేవలం టాపర్లను ప్రోత్సహించడమే కాకుండా తోటి విద్యార్థుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. టాపర్ల స్థానాల్లో తాము ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనను మిగిలిన విద్యార్థుల్లో రేకెత్తిస్తోంది. రానున్న పరీక్షల్లో వారి కన్నా ఎక్కువ మార్కులు సాధించి తాము టాపర్లుగా నిలవాలనే కసిని పెంపొందిస్తోంది. ఈ ప్రభావం సీ, డీ గ్రేడ్ విద్యార్థులపై పడి వారు సైతం ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రోత్సాహకరంగా నిలుస్తోంది.
చదవండి: Open school admissions: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీలు ఇవే...
తొలిరోజు 4,110 మంది హాజరు న్యూస్‌రీల్ ప్రోత్సాహం.. స్ఫూర్తిమంతం
విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేలా.. నూతనోత్సాహం పెల్లుబికేలా.. వినూత్నంగా సెల్ఫీ కార్యక్రమం అమలు ప్రభుత్వ బడుల విద్యార్థులకు ప్రేరణ తీపిగుర్తుగా..
ప్రముఖులే వచ్చి తమతో సెల్ఫీలు దిగడం అనే భావన విద్యార్థులను గర్వపడేలా చేస్తోంది. పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన తమతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ తోటి మిత్రుల సమక్షంలో సెల్ఫీలు దిగడం వారికి తీపిగుర్తుగా మిగిలిపోనుంది. అలాగే విజయాలు సాధించిన విద్యార్థులు తమ స్థానాలను కాపాడుకోవడానికి, ఇతర విద్యార్థులు తామూ ఆ ఘనత సాధించడానికి ఇటువంటి కార్యక్రమం స్ఫూర్తిగా నిలుస్తోంది.
అందరూ భాగస్వాములు కావాలి
సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం అత్యుత్తమమైన అద్భుత ఆలోచన. సర్కారీ బడుల్లో విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడానికి ఇదో చక్కటి వేదిక. సెల్ఫీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై విద్యార్థులను ప్రోత్స హించాలి. టాపర్స్‌కు దక్కుతున్న గౌరవం తామూ దక్కించుకోవాలనే కాంక్ష ఇతర విద్యార్థుల్లో సైతం కలగాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యపడతాయి.
– తోట ఎడ్వర్డ్, వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు
ప్రామాణికంగా ప్రభుత్వ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో అందుతున్న విద్య విద్యార్థుల్లో ఎంతటి ప్రోత్సాహం నింపుతుందో సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం నిరూపించనుంది. ఇది ఇతరులకు ప్రామాణికంగా నిలవనుంది. ప్రతి పాఠశాలలో సెల్ఫీ విత్ టాపర్స్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలను విద్యార్థులు అందుకుంటూ అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. – పి.శ్యామ్‌సుందర్, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు