Skip to main content

Children's Day Celebration: అక్టోబర్ 26 నుంచి బాలల దినోత్సవ పోటీలు

Talented Children in Various Fields, Children's Day competition from 26 ,Children's Day Program,DEO M. Venkatalakshmamma

అనకాపల్లిటౌన్‌: బాలల దినోత్సవ కార్యక్రమాలను ఈ నెల 26 నుంచి నవంబర్‌ 14 వరకూ నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్‌ తెలిపారు. స్థానిక డీఈవో కార్యాలయంలో డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ చేతుల మీదుగా బాలల దినోత్సవ కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరింపజేశారు. ఈ సందర్బంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ 26న చిత్రలేఖనం, 27న దేశభక్తి పాటలు, 28న పద్యపఠనం, 29న క్విజ్‌, నవంబర్‌ 1న కాగితంతో కళాకృతులపై పోటీలు నిర్వహిస్తామన్నారు. 13న స్క్రూటినీ జరిపి, 14న వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన బాలలకు పురష్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా కార్యదర్శులు సీహెచ్‌ పెద్దినాయుడు, కాండ్రేగుల జనార్దనరావు, మండల అధ్యక్షుడు జి.శ్రీను, కార్యదర్శి పి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: School Games Federation: ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో విద్యార్థుల సత్తా

Published date : 16 Oct 2023 10:56AM

Photo Stories