School Games Federation: ఎస్‌జీఎఫ్ పోటీల్లో విద్యార్థుల సత్తా
అనకాపల్లిటౌన్: విశాఖ ఉమ్మడి జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అండర్ – 17 విభాగంలో మామిడిపాలెం ప్రభుత్వహైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన పదోతరగతి విద్యార్థి మునగపాక నరేంద్ర, తృతీయస్థానం సాధించిన బొజ్జ లోకేష్, ఫోర్టీన్ ఫెన్సింగ్ క్రీడలో ప్రతిభ చూసిన 9వ తరగతి విద్యార్థినులు కుర్రు జానకీ, కావ్య రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక హైస్కూల్ ఆవరణలో శుక్రవారం విద్యార్థులను హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు హెచ్‌బీ. శ్రీధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే ఎస్‌జీఎఫ్ క్రీడాపోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్.గౌరీ, గొంది చిన్నబ్బాయి. తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఎం.పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Faculty Posts: ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు అధ్యాపకుల నియామకం
కశింకోట: స్థానిక బాలికల హైస్కూలుకి చెందిన వంతల వేదిక వాలీబాల్ పోటీలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. పాడేరులో స్కూలు గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల స్థాయి పోటీల్లో 14 ఏళ్లలోపు విభాగంలో వేదిక తన ప్రతిభ చూపింది. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు. త్వరలో అరకులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వేదిక పాల్గోనుంది . రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వేదికను శుక్రవారం పాఠశాలలో హెచ్‌ఎం ఎం.ఎస్. స్వర్ణకుమార్, పీడీ పెంటకోట కమల, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
చదవండి: Sports: గురుకులాల జోనల్ క్రీడలు ప్రారంభం
యలమంచిలి: రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు మండలంలో జంపపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని యల్లపు నీరజ ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయుడు శాస్త్రి శుక్రవారం తెలిపారు. ఇటీవల విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం కణితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ –17 జిల్లా స్థాయి త్రోబాల్ పోటీల్లో నీరజ ప్రతిభ కనబరిచినట్టు చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా జట్టులో రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో ఆడనున్నట్టు తెలిపారు. నీరజను ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.