Open school admissions: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీలు ఇవే...
రాయవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 31 వరకూ అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చు. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల విద్యాశాఖాధికారులు జి.నాగమణి, ఎస్.అబ్రహం శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఈ విషయం తెలిపారు. పదో తరగతిలో అడ్మిషన్ పొందే ఓసీ విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100, అడ్మిషన్ ఫీజు రూ.1,450 చెల్లించాలి.
అన్ని వర్గాల సీ్త్రలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌సీ పురుషులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100, అడ్మిషన్ ఫీజు రూ.1,050 చెల్లించాలి. ఇంటర్మీడియెట్ అడ్మిషన్‌కు ఓసీ పురుషులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, అడ్మిషన్ ఫీజు రూ.1,600, అలాగే అన్ని వర్గాల సీ్త్రలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌సీ పురుషులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, అడ్మిషన్ ఫీజు రూ.1,300 చెల్లించాల్సి ఉందని అధికారులు వివరించారు.
ప్రాస్పెక్టస్ కం అప్లికేషన్ ఫారాన్ని సంబంధిత స్టడీ సెంటర్ నుంచి ఉచితంగా పొంది, వివరాలు పూరించి, తప్పులేవైనా ఉంటే సంబంధిత కో ఆర్డినేటర్ ద్వారా సరి చూసుకుని, ఏపీ ఆన్‌లైన్ కేంద్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ జిరాక్స్ కాపీ, ఫీజు రశీదును సంబంధిత ఏఐ కేంద్రంలో ఇవ్వాలన్నారు. విధిగా 30 రోజులు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. స్టడీ సెంటర్‌లో ఎటువంటి ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదని, దళారులను నమ్మవద్దని స్పష్టం చేశారు. వివరాలకు సమీప ఏఐ కేంద్రాలను లేదా జిల్లా కో ఆర్డినేటర్‌ను 89776 45704 నంబరులో సంప్రదించాలని నాగమణి, అబ్రహం తెలిపారు.