Skip to main content

Navodaya Admissions: నవోదయ దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

తిరుపతి ఎడ్యుకేషన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి 2024 ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 31వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ యన్‌.విశ్వనాథ రెడ్డి అక్టోబ‌ర్ 14న‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Navodaya Admissions
నవోదయ దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

 9వ తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ ఏడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే 1, 2009 నుంచి జూలై 31 2011మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులని తెలిపారు.

11వ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2007 జూన్‌ 1 నుంచి 2009 జూలై 31 మధ్యన జన్మించిన వారై ఉండాలన్నారు. ఇతర వివరాలకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. పరీక్ష 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఉంటుందన్నారు.

చదవండి:

BRAOU: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

Spot Admissions for Degree Colleges: ఈ నెల 16 నుంచి స్పాట్ అడ్మిష‌న్స్

 

Published date : 16 Oct 2023 03:24PM

Photo Stories